ఈనెల 24వ తేదీ శుక్రవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని ఆస్థాన ఏ గౌసియా పీఠాధిపతి, ప్రభుత్వ ఖాజీ సయ్యద్ షా గౌసీపీరా ఖాద్రి గురువారం తెలిపారు తెలిపారు. ప్రత్యేక నమాజు తరావీ ప్రార్థనలు గురువారం రాత్రి ప్రారంభమవుతాయని, శుక్రవారం నుంచి ఉపవాస దీక్షలు మొదలవుతాయని తెలిపారు. తెల్లవారుజామున 4. 50 గంటలకు సహరి పూర్తి చేయాలని, సాయంత్రం 6. 33 గంటల అనంతరం ఉపవాస దీక్షలు విరమించాల్సిన సమయంగా తెలిపారు.