ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్క్‌ టు రూల్‌ ప్రకారం మాత్రమే పని చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 11:49 AM

వర్క్‌ టు రూల్‌కు ఉద్యోగులు సహకరించాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు గిరికుమార్‌రెడ్డి కోరారు. కర్నూలు నగరంలోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించ తలపెట్టిన రీసర్వే శిక్షణ కార్యక్రమానికి ఉద్యోగులను 10.30 గంటల వరకు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గిరికుమార్‌ రెడ్డి మాట్లాడుతూ వర్క్‌ టు రూల్‌ ప్రకారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పని చేయాలని ఉద్యోగులను కోరామన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా శుక్రవారం ఏపీ ఎన్‌జీవోస్‌ నాయకులను కలిసి మద్దతు కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వై.కృష్ణ, ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి సి.నాగరాజు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa