ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసెంబ్లీ సమావేశాలు సమయంలోనే సీఎం జగన్ టెన్షన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 11:54 AM

14న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగంతో మొదలైన అసెంబ్లీ సమావేశాలు.. శుక్రవారం ముగిశాయి. పదిరోజుల్లో సభ మొత్తంగా 8రోజులు నడిస్తే.. మొదటిరోజు తప్ప ప్రతిరోజూ టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేశారు.  అయితే ఈ పది రోజుల్లో   మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయడం ఖాయమని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలియజేయడం.. అదే సమయంలో వారిని దర్యాప్తు సంస్థ విచారణకు పిలవడంతో.. ఆందోళన చెందిన సీఎం.. 16న సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన వెంటనే ఢిల్లీ వెళ్లారు.  మర్నాడు ప్రధాని మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశారు. కేసు నుంచి బయటపడేయాలని అభ్యర్థించారని.. వారి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో వెనుదిరిగారని టీడీపీ వర్గాలు ద్వారా  ప్రచారం జరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa