ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువగళం పాదయాత్రలో హీరో నారా రోహిత్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 12:24 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు హీరో నారా రోహిత్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ డెఫన్స్‌లో పడిందని.. అందుకే తెలుగుదేశం పార్టీపై బురదజల్లుతున్నారని విమర్శించారు. యువగళం పాదయాత్ర మున్ముందు ప్రభంజనం రేపుతుందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సైతం నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజకీయాల్లోకి వస్తారని నారా రోహిత్ పేర్కొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa