ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయ్యడం అంతా కుట్రపూరితంగా జరిగింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 05:33 PM

కాంగ్రెస్ యువ నాయకుడు  రాహుల్‌గాంధీపై పార్లమెంట్‌లో అనర్హత వేటు విధించడం దుర్మార్గమని రాజమహేంద్రవరం  కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్‌ అన్నారు. రాజమహేంద్రవరంలో కృష్ణనగర్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన, పీసీసీ కార్యదర్శులు ముళ్ళ మాధవ్‌, బెజవాడ రంగారావు, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకురాలు ఆకుల సూర్యభాగ్యలక్ష్మి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా తమ నాయకుడిపై అనర్హత వేటు వేశారన్నారు. 2019లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ ప్రసంగంలో దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడిన నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీగురించి మాట్లాడిన సమయంలో మోదీల వల్లన దేశానికి నష్టం జరుగుతుందని అన్న దానికి అక్కడ మాజీ ఎమ్మెల్యే పరువునష్టం దావా వేశారని, దానికి ఇప్పుడు రెండేళ్లు శిక్ష విధించడం వెంటనే పార్లమెంట్‌లో అనర్హత వేటు వేయ్యడం అంతా కుట్రపూరితంగా జరిగిందన్నారు. అలాగే అదానికి మోదికి ఉన్న అంశాలపై జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీ వేసి విచారణ చేయాలని రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేయడంతో రాహుల్‌ గొంతునొక్కాలని ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు జోడోయాత్ర చేసిన రాహుల్‌గాంధీ దేశ ప్రజలతో మమేకమయ్యారని, 2024లో దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఆయన ప్రధాని కావడం ఖాయమని భయపడుతున్న బీజేపీ కుట్రచేసి ఈ దుశ్చర్యలకు పాల్పడిందని దీనికి తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని వారు హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నలబాటి శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa