ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్ని శాఖల ఉద్యోగులు సహకరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 05:32 PM

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పోరాట కార్యక్రమానికి ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులందరూ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారని అమరావతి జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. కానూరులోని రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌, కమి షనర్‌ కార్యాలయం, ఏపీ ఫుడ్‌ కమిషన్‌, ఏపీ లీగల్‌ మెట్రాలజీ, ఏపీ కన్జ్యూమర్‌ కమిషన్‌ కార్యాలయాలను సందర్శించి ఉద్యోగులతో ఉద్యమ కార్యాచరణపై బొప్పరాజు మాట్లాడారు. ఈనెల 9 నుంచి ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో చేస్తున్న నల్లబ్యాడ్జీలతో నిరసన, 21 నుంచి నిర్వ హిస్తున్న వర్క్‌ టూ రూల్‌ ఉద్యమాలకు అందరి మద్దతు కోరి, చేయిచేయి కలుపుదాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa