ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంట్లోకి చొరపడి పట్టపగలే చోరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 05:32 PM

శ్రీకాకుళం జిల్లా,  రణస్థలం పంచాయతీ బావరాజపాలెం గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దొంగలు అపహరించారు. పోలీసుల వివరాల మేరకు.. బావరాజపాలెంకు చెందిన సుగ్గు గోవిందరావుకు మండల కేంద్రంలో గాజుల దుకాణం ఉంది. ఎప్పటిలాగే తన భార్య శ్యామలతో కలిసి శుక్రవారం ఉదయం 10 గంటలకు దుకాణానికి వచ్చాడు. ఇది గమనించిన దొంగలు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి తలుపులు, గ్రిల్స్‌ను కట్‌చేసి లోపలకు ప్రవేశించారు. బీరువా తలుపులు పగులగొట్టి అందులో ఉన్న నగదు, 6 తులాల బంగారం, 11 తులాల వెండి ఆభరణాలను చోరీ చేశారు. ఈ విషయాన్ని స్థానికులు ఫోన్‌లో బాధితులకు సమాచారం ఇచ్చారు. వారు ఇంటికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చా రు. ఘటనా స్థలాన్ని క్లూస్‌ టీమ్‌ పరిశీలించి ఫింగర్‌ ప్రింట్స్‌ను సేకరించింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa