పోలవరం ప్రాజెక్ట్‌పై సీఎం జగన్ స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారని టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..... ‘‘పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు హయాంలో 70 శాతం పూర్తి అయింది. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి సీఎం అయి పోలవరాని భ్రష్టు పట్టించారు. పోలవరం డ్యాం ఎత్తు 150 అడుగుల నుంచి 135 అడుగులకు కుదించి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తున్నామని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారు. ఎత్తు తగ్గించడం వలన ఉత్తరాంధ్రకు అన్యాయం. ఉత్తరాంధ్రలో నీటి ప్రాజెక్ట్‌లు ఆగిపోయాయి. పోలవరం ప్రాజెక్ట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ ను సంతోష పరచడానికి జగన్ వ్యవహరిస్తున్నారు. ఎత్తు తగ్గిస్తే 72 టీఎంసీల లైవ్ స్టోరేజ్ కోల్పోతున్నాం. హైట్‌లో ఉంటే గ్రావిటీతో ఫ్లో వస్తాది. పోలవరం ప్రాజెక్ట్‌పై కలిసి పోరాటం చేయడానికి సిద్ధం. సాధ్యం కానీ హామీలు ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చారు.’’ అని ధ్వజమెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa