ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నియోజకవర్గాల ఇంచార్జ్‌లే పార్టీకి ప్రధానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 05:36 PM

 తాడేపల్లిగూడెం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. టీడీపీలో అనుమానం అనే ఒక వ్యాధి ఉందని,.. ఆ వ్యాధి పోగొట్టాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నియోజకవర్గాల ఇంచార్జ్‌లే పార్టీ తరపున ప్రధానమన్నారు. పార్టీకి భిన్నంగా వ్యవహిరిస్తే ఒకటి రెండు సార్లు చెబుతామని, అప్పటికీ వినకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీలో ఆర్థికంగా అన్ని రకాలుగా బలమైన నాయకుడుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మొదటి నాయకుడు వలవల బాబ్జీనే అన్నారు. తాడేపల్లిగూడెం ఇంచార్జ్ వలవల బాబ్జీ బలమైన నాయకుడన్నారు. పార్టీల్లో నాలుగేళ్లు లేని వారు, అప్పటి వరకూ దూరంగా ఉన్నవాళ్లు మరలా పార్టీకి పూర్వ వైభవం రానున్న నేపథ్యంలో ఇప్పుడు మరలా నిద్రావస్థలో ఉన్న వాళ్ళు వస్తారన్నారు. వాళ్ళ గురించి మీరు ఎవ్వరూ ఆలోచించనవసరంలేదన్నారు. ఇప్పటి వరకూ టీడీపీ కార్యకర్తలకు ఆర్థికంగా ఆసరా ఇవ్వలేకపోయామని టీడీపీ అధినేత చంద్రబాబు  స్వయంగా చెప్పారు ఆ తప్పు సరిదిద్దుకుంటామని ఆయనే చెప్పారని గుర్తుచేశారు. రేపు ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa