అసైన్ మెంట్ కమిటీ ఏర్పాటు చేసి జిల్లాలోని అర్హులైన దళిత, బడుగు, బలహీన వర్గాల వారికి భూములు పంపిణీ చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు రామాజీ ఇమ్మానుయేల్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రొద్దుటూరు స్థానిక మైదుకూరు రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు జి. వెంకటరమణ, మురళీ ప్రసాద్, చిన్న ఓబన్న, ఏసురత్నం, అరుణ్, కిరణ్, ప్రసాద్, చంద్రశేఖర్, గోకుల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.