వేసవిలో వడదెబ్బ తగిలే అవకాశాలున్నాయని అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలసట, కళ్లు తిరగడం, వికారం, వాంతులు, అధిక దాహం, గుండె వేగంగా కొట్టుకోవడం, తక్కువ మూత్ర విసర్జన వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రథమ చికిత్సగా మెడ, ముఖంపై ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి. ఎక్కువగా నీళ్లు, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని, మద్యానికి దూరంగా ఉండాలి.