వేంపల్లె మండలంలోని సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పాండిచ్చేరి అరబిందో ఫౌండేషన్ కు చెందిన రైతులు సందర్శించినట్లు సిఎస్ఏ కోఆర్డినేటర్ ఆదినారాయణ తెలిపారు. గురువారం మండలంలోని టి. వెలమవారిపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన 5 రకాల పండ్ల మొక్కలు మరియు కాకర, టమోటా, కంది తదితర పంటలను పరిశీలించారు. అలాగే కుప్పాలపల్లి గ్రామంలో రైతు సమర సింహారెడ్డి సాగు చేసిన కల్పతరువు పద్ధతులను గుర్తించి, ఆదాయం, వ్యయం మరియు కషాయాల తయారీపై ఆరాతీసారు. అంతేకాకుండా కిసాన్ మిత్ర ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు ఆనంద రెడ్డి కుటుంబానికి రూ. 5 లక్షలు ఆర్థిక పరిహారం అందజేయడం జరిగిందని కిసాన్ మిత్ర భాస్కర్ అరబిందో ఫౌండేషన్ రైతులకు వివరించారు. రైతులకు కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ సేవల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.