రాజధాని అంశంపై సీఎం జగన్ పునరాలోచన చెయ్యాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రాజధాని ఉద్యమం 1200 రోజులకు చేరుకుని, చరిత్రలో కనివినీ ఎరుగని ఉద్యమమైందని తెలిపారు. అమరావతినే రాజధానిగా అభివృద్ధి పరచాలని హైకోర్టు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కచేయకుండా సుప్రీంకోర్టు కెక్కిందని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు.