పశ్చిమగోదావరి జిల్లాలోని దువ్వ వేణుగోపాలస్వామి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా వేణుగోపాల స్వామి ఆలయంలో నవమి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వేడుకల సందర్భంగా భారీ స్థాయిలో చలువ పందిళ్లు వేశారు. వేడుకలు జరుగుతున్న సమయంలో ఉత్సవాల నిర్వహకులు బాణాసంచా కాల్చారు. ఈ క్రమంలో ఓ తారా జువ్వ చలువ పందిళ్లపై పడింది. దీంతో ఒక్కసారిగా నిప్పంటుకుంది. క్షణాల వ్యవధిలో పందిళ్లకు మొత్తం మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆలయంలోని భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.