లారీ బోల్తా పడిన సంఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం పోలీసులు అందజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మెరకముడిదాం మండలం ఊటపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ విశాఖ నుంచి రాయగడకు లారీలో కర్రలను తీసుకెళ్తుండగా బొండపల్లి మండలంలోని బోడసంగిపేట గ్రామ పరిధిలో గల ఆర్. సి. ఎం స్కూల్ ఎదురుగా జాతీయ రహదారి పక్కన బుధవారం రాత్రి లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బొండపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.