జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు ఉన్నాయని, వెంటనే ఈ డబ్బు మంజూరుచేయాలని సీఎం జగన్, కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఇవాళ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి వైయస్.జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం వైయస్ జగన్ చర్చించారు. పలు అంశాలపై కేంద్ర మంత్రికి సీఎం వైయస్ జగన్ నివేదించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని విజయవాడ బయల్దేరారు.