సమస్త మానవాళికి శ్రీరాముడు ఆదర్శప్రాయుడని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అన్నారు. నగరంలోని 44వ డివిజన్ హయాతి నగరం రెల్లివీధిలో కవ్వాడి సుశీల ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సీతారామ సమేత లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలను ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా అప్పలసూరి నారాయణ మాట్లాడుతూ రామనామ స్మరణ సమస్త సమస్యల నివారణకు పరిష్కారమన్నారు. తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా. రాము ఎప్పుడూ సత్యాన్ని, ధర్మాన్ని విడిచిపెట్టలేదని చెప్పారు. హిందూ సనాతన సంప్రదాయంలో శ్రీ రాముని పేరు అతిపెద్ద తారక మంత్రంగా పరిగణించబడుతుందని అన్నారు.
తన జీవితంలో ఏర్పడిన అన్ని సంబంధాలను గౌరవిస్తూ, రామయ్య తన తర్వాత తరాల వారికీ ఉదాహరణగా పిలిచాడని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నగర అధ్యక్షులు మాదర్ వెంకటేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనలో సంక్షేమ రాజ్యాన్ని అందించి రామరాజ్యాన్ని తలపించాలని పేర్కొన్నారు. నేడు రాక్షస పాలనలో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని వివరించారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి శ్రీకాకుళం మీడియా కన్వీనర్ జామి భీమశంకర్, వార్డు ఇన్చార్జిలు సిపాన రమ, సురకాశి వెంకటరావు, కరగాన భాస్కరరావు కరగాన రాము, తెలుగు యువత నగర్ కార్యదర్శి జలగడుగుల జగన్, రెల్లి వీధి యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.