కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీపై బ్రిటన్ కోర్టులో కేసు పెడతానని హెచ్చరించారు. దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని రాహుల్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లలిత్ మోడీ స్పందించారు. తనను ‘పరారైన వ్యక్తి’గా ఏ విధంగా ముద్ర వేస్తారని ప్రశ్నించారు. తాను దోషినని న్యాయస్థానాలేవీ తీర్పు చెప్పలేదని, అందువల్ల తాను సాధారణ పౌరుడినని చెప్పారు.