ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఉన్న వారికి కేంద్ర సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో ఉన్నవారు షేర్లు, స్టాక్స్, ఇతర పెట్టుబడి సాధనాల్లో చేసే లావాదేవీల విలువ 6 నెలల మూల వేతనం కంటే ఎక్కువగా ఉంటే ఆ వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది. వ్యక్తిగత లావాదేవీల విలువ 2 నెలల మూలవేతనం కంటే ఎక్కువగా ఉంటే ఆ వివరాలను కూడా రూల్ 16(4) ప్రకారం తెలియజేయాలని పేర్కొంది.