విశాఖలోని సీతకొండ అందాలకు సందర్శకులు ఫిదా అవుతున్నారు. గురువారం శ్రీరామనవమి సెలవు కావడంతో చాలా మంది సందర్శకులు సీతకొండ అందాలను వీక్షించేందుకు తరలివచ్చారు. జీ-20 సదస్సు నేపథ్యంలో నగర సుందరీకరణలో భాగంగా సీతకొండను అద్భుతంగా తీర్చిదిద్దారు. బండరాళ్లకు వివిధ రూపాల్లో బొమ్మలు వేయడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీంతో సందర్శకుల ఇక్కడ ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa