మే 10న జరగనున్న కర్ణాటక శాసనసభకు జరిగే ఎన్నికల్లో పూర్తి మెజారిటీ వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. కర్ణాటకలో ఎన్నికలకు ముందు కానీ, ఆ తర్వాత కానీ భాజపా ఎలాంటి భాగస్వామ్యానికి దిగదని స్పష్టం చేశారు. తొమ్మిది రోజుల పాటు కర్నాటకలోని ఐదు ప్రాంతాల్లో పర్యటించానని, ప్రజల ఆదరణ చూస్తుంటే రాష్ట్రంలో పూర్తి మెజారిటీ వస్తుందన్న నమ్మకం ఉందన్నారు.