ఓ నాలుగేళ్ల బాలుడు పుస్తకం రాసి రికార్డు సృష్టించిన ఘటన యూఏఈలో జరిగింది. సయీద్ రషీద్ అల్మెహెరి అనే బాలుడు 'ది ఎలిఫెంట్ సయీద్ అండ్ ది బేర్' అనే పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకం మార్చి 9 నాటికే 1000 కాపీలు అమ్ముడుపోవడంతో సయీద్ రికార్డు సృష్టించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ధ్రువీకరించారు. సయీద్ అక్క కూడా ఎనిమిదేళ్లకే ఒకే పుస్తకాన్ని రెండు భాషల్లో రాసి రికార్డు సృష్టించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa