ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల అప్ డేట్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 02, 2023, 12:48 PM

కాలినడకన అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో తిరుమలకు చేరుకునే భక్తులకు దివ్యదర్శన టోకెన్ల జారీ ప్రక్రియను టీటీడీ శనివారం ప్రారంభించింది. శనివారం ఉదయం 5 గంటలకు అలిపిరి నడక మార్గంలోని గాలి గోపురం వద్ద టోకెన్ల ప్రక్రియను మొదలుపెట్టారు. శ్రీవారిమెట్టు మార్గంలోని 1,250వ మెట్టు వద్దనున్న కౌంటర్లలో ఉదయం 6 గంటలకు టోకెన్ల జారీని ప్రారంభించారు. ఉదయం 9.30 గంటలకల్లా 15 వేల కోటా పూర్తయిపోయింది. భక్తుల తాకిడి అధికంగా ఉన్న క్రమంలో 2వ తేదీకి సంబంధించి దాదాపు 3 వేల దివ్యదర్శన టోకెన్లను జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa