ఏపీ సీఎం వైస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదల ఇళ్లకోసం అమరావతిలో 1,134.58 ఎకరాలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కూరగల్లు, నిడమానూరు ప్రాంతాల్లో మొత్తం 20 లేఔట్లలో స్థలాలు కేటాయిస్తామన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు.