జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న పవన్ నేడు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. పవన్ వెంట నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. టీడీపీతో పొత్తుకు జనసేన సిద్ధమవుతోందని ఇప్పటికే అందరూ భావిస్తున్న తరుణంలో బీజేపీ అగ్రనేతలను పవన్ కలవనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.