మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై 30 రోజుల్లో అప్పీల్ చేసుకునేందుకు కోర్టు కాలపరిమితిని విధించింది. ఈ నేపథ్యంలో ఈరోజు అప్పీల్ చేయడానికి రాహుల్ గాంధీ విమానంలో సూరత్ చేరుకున్నారు. రాహుల్ వెంట ఆయన సోదరి ప్రియాంకా గాంధీ కూడా ఉన్నారు.