నెల్లూరు జిల్లాలో ఇటీవల వైసీపీ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే ఓటు వేయలేదనే కారణంగా ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఇది జరిగి నెల రోజులు కాకముందే కావలిలో కీలకంగా వ్యవహరించే సుకుమార్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ అధిష్టానం లేఖ విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందునే సస్పెండ్ చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. సుకుమార్ రెడ్డి కావలిలో అంతా తానై వ్యవహరించారు. ఇక్కడ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డా? లేక సుకుమార్ రెడ్డా? అనే అనుమానాలు వచ్చే విధంగా ఈయన ఒక షాడో ఎమ్మెల్యేలా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, సుకుమార్ రెడ్డిల మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. దీంతో అధిష్టానం సుకుమార్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో వైసీపీ శ్రేణులు అయోమయానికి గురయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa