మంగళగిరికి సంబంధించిన ఏ నిర్ణయమైనా జగన్ తీసుకుంటారని, ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సోమవారం సమీక్ష జరిగింది. అయితే ఈ సమావేశానికి ఆయనతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు గైర్హాజరయ్యారు. అనారోగ్యం, ఇతర కారణాలతో సమీక్షకు హాజరు కాలేదన్నారు. మంగళగిరిలో నేను పోటీ చేయకపోయినా గెలిచేది వైసీపీనే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa