యువగళం పాదయాత్రను విజయవంతం చేద్దామని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెదేపా నాయకులకు బుధవారం సూచించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువ గళం పాదయాత్ర త్వరలోనే పెద్దపప్పూరులో నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను జేసీ పరిశీలించారు. పెద్దపపూరు మండల కేంద్రంలో భోజన వసతి, జూటూరులో విడిది కేంద్రానికి స్థలాలను పరిశీలించారు. పాదయాత్రలో పాల్గొనే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని స్థానిక నాయకులను సూచించారు. అనంతపురం పార్ల మెంటు తెలుగు యువత ఉపాధ్యక్షుడు లోకనాథ్ రెడ్డి, మండల కన్వీనర్ రఘు తదితర నాయకులు పాల్గొన్నారు.