యాడికి మండల పరిధిలోని కోనుప్పలపాడు గ్రామంలో ఓ మహిళ పురుగుల మందు తాగి బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి వివరాల మేరకు. గ్రామానికి చెందిన కంబగిరి రాముడు భార్య లక్ష్మీదేవి (29) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈనేపథ్యంలో నొప్పితాళలేక పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను 108లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడే మృతి చెందింది. ఈమెకు భర్తతో పాటు ముగ్గురు సంతానం ఉన్నారు.