పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ప్రారంభోత్సవ సభలో మంత్రి విడుదల రజిని పాల్గొని మాట్లాడారు. ‘భారతదేశ ఆత్మ గ్రామ సీమల్లోనే ఉందని గాంధీజీ ఎప్పుడో చెప్పారు. పల్లె సీమలే దేశానికి పట్టుగొమ్మలని మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ బలంగా నమ్మారు. అందుకే చక్కటి వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. ఈ వలంటీర్ వ్యవస్థ గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ ఆత్మబంధువులా పనిచేస్తుంది. గ్రామాలు, పట్టణాల్లో వలంటీర్లు ఏ విధంగా సేవలు అందిస్తున్నారో అందరికీ తెలుసు. అదే దిశగా ప్రతి గ్రామంలో డాక్టర్ వైయస్‌ఆర్ విలేజ్ క్లినిక్‌లు దర్శనమిస్తున్నాయి. గ్రామ ఆరోగ్య సౌభాగ్యమే.. దేశ ఆరోగ్య సౌభాగ్యమని అంటుంటారు. అది దృష్టిలో పెట్టుకొని వైయస్‌ఆర్ విలేజ్ క్లినిక్స్‌కు సీఎం వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును తీసుకువచ్చారు అని తెలియజేసారు.