ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని చక్రతా సమీపంలోని మారుమూల ప్రాంతమైన తుని గ్రామంలో గురువారం సాయంత్రం ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు బాలికలు సజీవదహనమయ్యారు. నాలుగు సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలడంతో ఈ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఇల్లు చెక్కతో తయారుచేయడంతో మంటలు వేగంగా వ్యాపించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa