కాంగ్రెస్ పార్టీ వీడి అలా కమలం పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని బీజేపీ హైకమాండ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక బాధ్యతలను కూడా ఆయనకు ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ మూడు రాష్ట్రాల్లో రెడ్డి సామాజికవర్గం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో కిరణ్ సేవలను బీజేపీ ఉపయోగించుకోనుంది. రెడ్డి సామాజికవర్గ నేతలతో టచ్ లోకి వెళ్లాలని ఇప్పటికే కిరణ్ కు పార్టీ పెద్దలు చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్పతో కిరణ్ భేటీ అయ్యారు. కిరణ్ తో కలిసి పని చేయాలని చెప్పేందుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఏపీలో రాజంపేట లోక్ సభ స్థానం నుంచి కిరణ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.