మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదని మంత్రి కాకాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో మహిళలను అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని స్పష్టం చేశారు. చంద్రబాబులాంటి పనికి మాలిన వ్యక్తులు తిడితే పట్టించుకోమన్నారు. రాష్ట్రంలో ఏ ఇంటికి వెళ్లినా గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలు చెబుతారన్నారు. చంద్రబాబు అక్కడికి వెళ్లి సెల్ఫీలు తీసుకోవాలని సెటైర్లు వేశారు.
తమ ప్రభుత్వంలో వ్యవసాయం లాభసాటిగా మారిందని.. తాము తీసుకున్న విధానాలు వల్ల ఉత్పత్తి పెరిగిందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. రైతులకు గిట్టుబాటు వస్తుంటే చంద్రబాబు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కడుపు మండుతుందని ఫైరయ్యారు. గత ప్రభుత్వంలో సోమిరెడ్డి మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకుని వారిని నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు.
గత టీడీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా పరిపాలన చేశానని చంద్రబాబు చెప్పలగలరా అని మంత్రి కాకాణి సూటిగా ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో తెలుగు దేశం పార్టీ భూస్థాపిమైనదని.. ఈ విషయాన్ని శుక్రవారం జరిగిన సమీక్షలో చంద్రబాబు కూడా ఒప్పుకున్నారని చెప్పారు. చంద్రబాబుకు పాజిటివ్ ఓటు బ్యాంక్ లేదని.. ఆయన అంతంటి మోసగాడు లేడని టీడీపీ నేతలే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పర్యటనల వల్ల తమ పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని మంత్రి కాకాణి అన్నారు. ఇక, తాము చేసిన అభివృద్ధిని చూపిస్తూ చంద్రబాబు సెల్ఫీలు తీసుకోవడం సిగ్గు చేటని దుయ్యబట్టారు.
ఇదిలావుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సెల్ఫీ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. నెల్లూరులో టిడ్కో కాలనీ ఇళ్ల ముందు సెల్ఫీ తీసుకున్న చంద్రబాబు.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గత ప్రభుత్వంలో పేదల కోసం కట్టిన వేలాది ఇళ్లు ఇవి అని.. రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలని చెప్పారు. మరి నాలుగేళ్లలో మీరు నిర్మించిన పేదల ఇళ్లు ఎన్నో లెక్క చెప్పగలరా? అసలు మీరు కట్టిన ఇళ్లు ఎన్నో చూపించగలరా అని సీఎం జగన్‌కు చంద్రబాబు చంద్రబాబు సవాల్ విసిరారు. ఈ క్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైరయ్యారు.