వెదురు కుప్పం మండలంలోని పచ్చి పంచాయతీ కోణంగిపల్లి గ్రామంలో శ్రీ రామనవమి ఉత్సవాలు సందర్భంగా ఆదివారం పశువుల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. వేల సంఖ్యలో జనం వందల సంఖ్యలో పశువులు రావడంతో పశువుల పండగ కోలాహాలంగా నిర్వహించారు.
మండలంతో పాటు పరిసర గ్రామాలనుంచి పశువులను ఆదివారం ఉదయం తొలుకొచ్చారు. అక్కడ పశువులకు, గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఎద్దులకు, ఆవులకు, రాజకీయ నాయకులు, సినీ నటులు, దేవుళ్ళ ఫోటోలు, రంగు కాగితాలు అంటించిన చెక్క పలకలతో పాటు, నగదు, దుస్తులు, విలువైన వస్తు సామాగ్రిని కట్టారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గ్రామస్తులు నడివీధిలో జల్లిని ఏర్పాటు చేయడంతో యువకులు జల్లిలో పశువులను పట్టేందుకు పోటీ పడ్డారు.
పశువులకు కట్టిన పలకలను చేజిక్కించుకోవడంలో యువకులు పశువులను నివారించే క్రమంలో కింద పడి గాయపడ్డారు. ఇళ్లపైన చెట్లు కొమ్మలపైన నిలబడి పశువుల పండుగ ను తిలకించారు.