రాజంపేట పట్టణంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిధున రెడ్డి ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల 15న జరిగే మెగా జాబ్ మేళాను రైల్వే కోడూరు మరియు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాల నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే కోడూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఒక ప్రకటనలో కోరారు. పదవ తరగతి నుండి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు అని, ఎన్నికైన వారికి హైదరాబాద్, చెన్నై, తిరుపతి, కడప ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు కొరముట్ల తెలిపారు.