పెనగలూరు మండలం కొండూరు పంచాయతీ దామరచర్ల గ్రామంలో భూకబ్జాలకు పాల్పడుతున్న వారి జెసిబిని వీఆర్ఏలు ఎమ్మార్వో కు స్వాధీనం చేస్తే కేసు పెట్టకుండా వదిలిపెట్టమన్న దానిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆదివారం రైల్వే కోడూరు లోని సిఐటియు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎటువంటి నోటీసు లేకుండా నలుగురు విఆర్వోలని రాత్రి డ్యూటీలకు పోలేదని డైరెక్ట్ గా సస్పెండ్ చేశారని, దీనిపైన కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వీఆర్వో, ఆర్ ఐ, ఆధ్వర్యంలోనే వీఆర్ఏలు పనిచేయాలని, వారు లేకుండా వీరిని నేరుగా అడవిలో ఎటువంటి ఆయుధాలు లేకుండా కాపలా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఏప్రిల్ 4 న మధు, శివ, వెంకటేశు, కరీముల్లా నైట్ డ్యూటీలకు పోలేదని చట్ట వ్యతిరేకంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. వీఆర్ఏలకు, జీవోలో ఎక్కడ రాత్రి డ్యూటీలు లేవన్నారు. తక్షణం వీఆర్ఏల అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.