ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న మా నమ్మకం నువ్వే, జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఇంటికి వైసీపీ స్టిక్కర్లు అతికించడానికి వ్యతిరేకిస్తూ గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్ అంబేద్కర్ స్థూపం దగ్గర సోమవారం వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన పార్టీ నిరసన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కావాలనే కుట్ర పూరితంగా ప్రతి ఇంటికి వైయస్సార్సీపి స్టిక్కర్లు అతికిస్తుందని, నేను జనసేన పార్టీకి సంబంధించిన వాడినని, నా ఇంటికి ఎలాగా వైసీపీ స్టిక్కర్లు అతిక్కిస్తారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గాదె వెంకటేశ్వరరావు తో పాటు జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, నగర అధ్యక్షులు నేరెళ్ళ సురేష్ , జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.