తెనాలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ సోమవారం ఆందోళన నిర్వహించారు. చెంచుపేట లోని విద్యుత్ డివిజనల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేశారని టీడీపీ నాయకులు విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతుల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.