ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొక్కజొన్న సాగు అధికంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు రూ. 1962 కనీసం మద్దతు ధర ప్రకటించగా, దానికి మించి ధరలు కొనసాగాయి. గత అక్టోబర్లో 2500 మేరకు కర్ణాటకలో ధర పలికింది. ప్రస్తుత మార్కెట్లోకి మొక్కజొన్న అందుబాటులోకి రావడంతో ధరలు క్రమేపి తగ్గుతూ వస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి డబ్బులు కూడా రావని వాపోతున్నారు.