రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో పేద ప్రజలను ఇబ్బంది పెడుతుందని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నరేంద్ర వర్మ అన్నారు. సోమవారం నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో బాపట్ల విద్యుత్ ప్రధాన కార్యాలయం వద్ద టిడిపి శ్రేణులు నిరసన తెలిపారు. విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేశారు.