ఈనెల 11న ఉమ్మడి గుంటూరు జిల్లా పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో సర్పంచ్ సమస్యల పరిష్కారానికి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి గుంటూరు జిల్లా సర్పంచ్ సంఘం కన్వీనర్ కల్లూరి శ్రీనివాసరావు సోమవారం ప్రకటన విడుదల చేశారు. కొరటాల సమావేశ మందిరంలో 11 సదస్సు జరుగుతుందని చెప్పారు. ముఖ్య అతిథిగా ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ సర్పంచ్ సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు పాల్గొంటారు.