ఎమ్మిగనూరు పట్టణాభివృద్ధి లో భాగంగా పట్టణంలోని శివన్న నగర్ నందు నాయిని బ్రహ్మ ణుల కాలనీలో గ్రావేల్ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం వైసీపీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెయస్. రఘు, వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్, మున్సిపల్ కమీషనర్ ఎన్. గంగిరెడ్డి, డిఈఈ మనోహర్ రెడ్డి, ఏఇ ప్రవీణ్ కుమార్ రెడ్డి, హౌసింగ్ ఏఇ ప్రసాద్, టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకె. రాజశేఖర్, పట్టణ అధికార ప్రతినిధి కె. సునీల్ కుమార్, కౌన్సిలర్లు ఆమాన్, డిస్ కేశవరెడ్డి, శివ ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.