గుంటూరు: న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ గెలవలేదని జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరు పార్టీ ఆఫీస్ లో సోమవారం మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించుకొని ఓటర్ లిస్టులు ద్వారా పూర్తిగా ప్రతి ఒక్కరి వివరాలు సేకరించి వాలంటీర్లను మన ఇళ్లకు కాపలా పెట్టారన్నారు. తెలుగుదేశం పార్టీ పరంగా ఓటర్లను తొలగించే పరిస్థితి ఉంటుందని ఓటర్ లిస్ట్ కు కాపలా ఉండాలన్నారు.