దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఎండలు పెరిగిపోయాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు అవసరమైతే తప్పా బయటికి రావద్దు. ఎండలో పని చేసే కార్మికులు గొడుగులు, చెట్ల కింద ఉండేలా చూసుకోవాలి. వేడిగాలులు తాకకుండా చెవులకు బట్టను కట్టుకోవాలి. నీళ్లు ఎక్కువ తాగుతుండాలి. పుచ్చకాయ,మజ్జిగ,కొబ్బరినీళ్లు,జ్యూస్ లు తీసుకోవాలి. వేసవి కాలం సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. లేనిచో వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. పిల్లలను ఈతకు వెళ్లనివ్వవద్దు. వడదెబ్బతో పాటు ప్రమాదవశాత్తు మరణించే ప్రమాదం ఉంటుంది. చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్దులు ఎండలపట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.