పలమనేరు రూరల్ లోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి 7 గంటలకే 22 ఏనుగుల గుంపు గ్రామీణ సమీప ప్రజలను గడగడ లాడిస్తున్నాయి. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలో చెత్తపెంప గ్రామం మీదుగా ఈ ఏనుగుల గుంపును గమనించిన అటవీశాఖ అధికారులు ట్రాకర్స్ కలిసి వాటిని తరిమెందుకు చెత్తపెంట నుంచి నలగాంపల్లి గ్రామానికి వచ్చే గ్రామంలో చిట్టి నాయుడు అనే రైతుకు చెందిన ఎకరా రాగిపంటను తొక్కి నాశనం చేశాయి.
ఆ తరువాత కోటూరు మీదుగా మండీపేట గ్రామ సమీపంలో ఈ గుంపును అష్టకష్టాలు పడి ఏనుగులు పంటలపై వెళ్ళనీయకుండా వూసరపెంట మీదుగా తరలిస్తుండగా అర్దరాత్రిలో ట్రాకర్స్ లపై హటాత్తుగా తిరగబడ్డాయి. అష్టకష్టాలు పడి ఉదయం 6 గంటలకు గుడియాత్తం రోడ్డు దాటి అడవిలోనికి మళ్ళించారు. ఈ గుంపు ఏనుగులు రాత్రికి ఎటువైపు వస్తాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.