రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా సాధన, వెలిగొండ ప్రాజెక్ట్ డిమాండ్లతో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర బుధవారం రాజుపాలెం, బోడపాడు, యాచవరం, మొద్దులపల్లి, గజ్జగ కొండ గ్రామాల్లో జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ... వెలిగొండ, మార్కాపురం జిల్లా ఏర్పాటుపై వైసీపీ చిత్తశుద్ధి లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే వెలిగొండ ప్రాజెక్ట్‌తోపాటు మార్కాపురం జిల్లా సాకారమతుందన్నారు. కార్యక్రమంలో కందుల రామిరెడ్డి, లక్ష్మీనారాయణ, రామాంజులరెడ్డి, కాకర్ల శ్రీను, తాండ్ర వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.