విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గురువారం ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ విశాఖలో రెండు విరుద్ధ ప్రకటనలు చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకుంది. ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనుకడుగు వేసిందన్న భావన వచ్చేలా ఆయన ప్రకటన చేశారు. అదే రోజు మధ్యాహ్నం నోవొటెల్ మీడియాతో ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తనపరిధిలోది కాదని, కేంద్ర క్యాబినెట్ నిర్ణయమని చెప్పడంతో కార్మికుల్లో అయోమయ పరిస్థితి ఏర్పడింది. అయితే కేంద్ర మంత్రి వ్యాఖ్యలు మీడియా తప్పుదోవ పట్టించిందని కేంద్రం స్పష్టం చేసింది. ఈమేరకు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై శుక్రవారం స్పష్టత ఇచ్చింది. ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోలేదని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆర్ఐఎన్ఎల్ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియపై ఎలాంటి స్తంభన లేదని తేల్చి చెప్పింది.
ఆర్ఐఎన్ఎల్ పెట్టుబడుల ప్రక్రియపై కొన్ని మీడియా నివేదికల్లో నిజం లేదని స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర మరోసారి స్పష్టత ఇచ్చింది. డిజిన్విస్టిమెంట్ ప్రక్రియలో నిలిచిపోలేదని స్పష్టం చేసింది. గడిచిన రెండు రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఉక్కు శాఖ ప్రకటన జారీ చేసింది. ఆర్ఐఎన్ఎల్ పెట్టుబడుల మీడియా నివేదికల్లో నిజం లేదని. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పురోగతిలో ఉందని ప్రకటించింది ఉక్కుశాఖ. ఆర్ఐఎన్ఎల్ పనితీరును మెరుగుపరచడానికి మాత్రమే మద్దతు ఇస్తున్నామని. త్వరలో ప్రైవేటీకరణ పూర్తి అవుతుందని తెలిపింది. నిన్న కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే విశాఖ వచ్చి తాత్కాలికంగా పెట్టుబడులు ఉపసంహరణ ఆగినట్టు ప్రకటించారు. దీనిపై అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, వైసీపీ ఎవరిరి వారు తమ ఘనతగా చాటుకుంటూ ప్రకటనల చేశారు. మాటలయుద్ధానికి కూడా దిగారు. ఇప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్- బీజేపీ మధ్య వార్ నడుస్తోంది.