ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి లబ్ది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 14, 2023, 07:48 PM

ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రతి కుటుంబం ఏదో విధంగా లబ్ది చేకూరిందని దాని ఫలితమే ప్రతి గడపలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నకు అపూర్వ ఆదరణ లభిస్తుందని మండల జేసీయస్ కన్వినర్ బాలినేని మాబయ్య పేర్కొన్నారు. మండలంలోని పొలంగారిపల్లి గ్రామములో మండల జేసీయస్ కన్వినర్ బాలినేని మాబయ్య ఆధ్వర్యంలో గురువారం జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఇంటి ఇంటి కి స్టిక్కర్ లు అంటించారు. ఈ సందర్బంగా మండల జేసీయస్ కన్వినర్ బాలినేని మాబయ్య మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం లో ప్రతి కుటుంబం నకు లబ్ది చేకూరిందని స్టిక్కర్ లు అంటించే కార్యక్రమం లో ప్రతి కుటుంబం ఆప్యాయత గా పలకరించడమే కాకుండా మళ్ళీ జగనన్న కే మా ఓటు అని బల్ల గుద్ది చెపుతుండడం ఎంతో అనందం కలిగిస్తుంది అన్నారు. రాష్ట్రం లో జగనన్నే మా భవిష్యత్తు అని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 2024 లో 175 స్థానాలలో జగనన్నను గెలిపించేందుకు ప్రజలు సిద్ధం గా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు కాకర్ల వెంకటయ్య, పులగంటి సుదర్శనం, పలుగోర్ల వెంకటయ్య, వైస్సార్సీపీ యువత, అభిమానులు, వాలింటర్స్, గృహ సారధులు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com