పశ్చిమ బెంగాల్ విద్యా కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆరు ప్రాంతాల్లో సోదాలు చేసింది. బుర్వాన్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహా నివాసాలపై సీబీఐ ప్రత్యేక బృందం దాడులు నిర్వహిస్తోంది. టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్‌పై కొనసాగుతున్న దర్యాప్తులో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సీబీఐ తెలిపింది. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. సీబీఐ బృందం ఈ ఉదయం కేంద్ర భద్రతా దళ సిబ్బందితో టీఎంసీ ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహా కార్యాలయం, ఇంటికి చేరుకుంది. ఎమ్మెల్యే తన కార్యాలయంలోనే ఉన్నారు. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తోంది.